ఓటీటీలో వినోదం పంచేందుకు సిద్ధమైన నాలుగు దక్షిణాది సినిమాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

సెప్టెంబర్ 25న ఒకే రోజు నాలుగు దక్షిణాది సినిమాలు వివిధ ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ అగధ జీ5 వేదికగా రానుండగా, తేన్పదియన్ దర్శకత్వంలోని స్పోర్ట్స్ డ్రామా అంగీకారం సన్‌నెక్స్ట్‌లో అందుబాటులోకి వస్తుంది. అలాగే మీరా కతీరవన్ పీరియాడిక్ చిత్రం హబీబి సోనీలివ్ వేదికగా, వివేకా దర్శకత్వంలోని మాంగో పచ్చా జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.