మందపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప పట్టివేత

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మందపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన విలువైన టేకు కలపను జన్నారం ఎఫ్ ఆర్ ఓ ఖదీర్ వలి సోమవారం పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న టేకును జన్నారం అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. అక్రమంగా కలపను రవాణా చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కలప అవసరాలకు అటవీశాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు.