విశాఖ పోలీసు పీజీఆర్ఎస్‌కు భారీగా తరలివచ్చిన 120 వినతులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి స్వయంగా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 120 ఫిర్యాదులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వచ్చిన అర్జీలను పరిశీలించి చట్టపరిధిలో బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులను సీపీ బాగ్చి ఆదేశించారు.