పలాసలో ఇంటింటి ప్రచారంతో హోరెత్తించిన స్వతంత్ర అభ్యర్థి దువ్వాడ శ్రీజ
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్ దువ్వాడ శ్రీజ గారు పట్టణంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ఓటర్లను కలుసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ధ్యేయమని తెలిపారు. ఎన్నికల్లో తనకు మద్దతునిచ్చి ఆశీర్వదించాలని ఓటర్లను కోరుతూ ముమ్మరంగా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.