ఆరవ తరఫు యుద్ధ విమానాల తయారీపై భారత్ ప్రత్యేక దృష్టి
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
ఆరవ తరఫు అత్యాధునిక యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కోసం భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బ్రిటన్, జపాన్, ఇటలీ దేశాలతో పాటు ఫ్రాన్స్ ఆధ్వర్యంలో నడిచే ఎఫ్ సీఏఎస్ ప్రాజెక్టులతో చర్చలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. దేశీయంగా ఐదు మరియు ఆరవ తరఫు యుద్ధ విమానాలను ఉత్పత్తి చేయాలనే ప్రణాళికలో ఉన్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.