బంగ్లాదేశ్ వాయుసేన మాజీ అధికారి మృతి: నదిలో విగతజీవిగా తాసిఫ్ శౌరీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఢాకా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం వీడుతున్న సమయంలో వీడియో తీశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వాయుసేన మాజీ అధికారి తాసిఫ్ శౌరీ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఆయన మృతదేహం నదిలో లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. షేక్ హసీనా పారిపోతున్న దృశ్యాలను బంధించినందుకు ఆయన్ను బలవంతంగా విధుల నుంచి తొలగించడంతో పాటు తీవ్ర వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపణలు గుప్పించారు.