సికింద్రాబాద్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అంబర్‌పేట పటేల్ నగర్ సీపీఎల్ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, సౌకర్యాల గురించి స్టూడెంట్స్‌ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యారంగ అభివృద్ధి, పాఠశాలల్లో కల్పించాల్సిన మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు.