రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు: మార్చిలోగా పంపిణీ పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ప్రకాశం
వచ్చే మార్చి లోపు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా నర్శింగోలులో నిర్వహించిన మీ భూమి-మీ హక్కు గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏ విధంగానైనా 34 శాతం కంటే ఎక్కువ సీట్లు పార్టీ పరంగా ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు.