నర్సంపేటలో నిఘా నేత్రాలు.. నేరగాళ్లకు ఇక చెక్!
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని పలు కూడళ్లలో పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలు, కీలక కూడళ్లలో ఏర్పాటు చేసిన కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించారు.
ఎక్కడైనా అనుమానాస్పద ఘటన జరిగినా వెంటనే గుర్తించేలా నిఘా కొనసాగుతోంది. నేరాలకు పాల్పడి తప్పించుకునే అవకాశం లేకుండా సీసీ కెమెరాలు కీలకంగా మారుతున్నాయని, ప్రజల భద్రతకు ఈ నిఘా వ్యవస్థ ఎంతో దోహదపడుతుందని పోలీసులు పేర్కొంటున్నారు.