పెట్రోల్ బంకుల్ లో తనిఖీలకు కేరళ సర్కార్ ఆదేశం: అనూప్ జాకబ్ హెచ్చరిక

రిపోర్టర్: సతీష్ స్థలం: Thiruvananthapuram

పెట్రోల్ లో అనుమతికి మించి ఇథనాల్ కలుపుతున్నారనే నివేదికల నేపథ్యంలో కేరళలోని పెట్రోల్ బంకుల్ లో విస్తృత తనిఖీలు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రితో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కర్ణాటకలో ఇలాంటి అక్రమాలు వెలుగుచూడటంతో ముందు జాగ్రత్తగా నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.