ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు దూరం అయిన ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్
రిపోర్టర్: అశోక్
స్థలం: London
ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ గాయం కారణంగా దూరం అయినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాలి వేలి గాయంతో బాధపడుతున్న జోష్ టంగ్, తదుపరి వైద్య పరీక్షల కోసం యూకేకి పయనం కానున్నట్లు వెల్లడించారు. పాకిస్థాన్ పర్యటన నుంచి ఈ సమస్యతో బాధపడుతున్న అతడు, ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లకు అందుబాటులో ఉండడని క్రీడా వర్గాలు స్పష్టం చేశాయి.