వెంకటాచలంలో పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎస్పీ
రిపోర్టర్: సాయి దివ్య
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మండలంలోని పలు బూత్‌లను డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.