రాష్ట్రంలో వివిధ అభివృద్ధి అంశాలపై అధికారులతో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష
రిపోర్టర్: గోపి
స్థలం: సంగారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయం, విద్యుత్, గ్రామీణ తాగునీటి సరఫరా, సాగునీరు, విపత్తుల నిర్వహణ అంశాలపై సమీక్షించి తదుపరి కార్యాచరణ ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు కలెక్టర్ సంగారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ప్రగతిని సమీక్షించి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.