మా బడిని తరలించవద్దు.. కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ఆందోళన
రిపోర్టర్: గోపి
స్థలం: కరీంనగర్
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గన్ముకుల ప్రభుత్వ పాఠశాలను వేరేచోటుకు తరలించవద్దని కోరుతూ విద్యార్థులు కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కేవలం 16 మంది విద్యార్థులున్న ఈ స్కూల్‌ను నాలుగు కిలోమీటర్ల దూరంలోని మరో పాఠశాలలో విలీనం చేయాలని అధికారులు నిర్ణయించగా, దీనిని వ్యతిరేకిస్తూ చిన్నారులు స్వయంగా కలెక్టరేట్‌కు తరలివచ్చి తమ పాఠశాలను కాಪಾడాలని కోరారు.