అసెంబ్లీలో ఉద్వేగంతో కంటతడి పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

తెలంగాణ శాసనసభలో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపడుతుండగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురై సభలోనే కంటతడి పెట్టుకున్నారు. స్పీకర్ స్థాయి వ్యక్తిని దూషించడం దారుణమని, ప్రజాస్వామ్య దేవాలయంలో వ్యక్తిగత దూషణలు తగవని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి.