వృషకర్మ ఫస్ట్ సింగిల్ అప్డేట్: అర్జున్ లుక్ తో అంచనాలు పెంచిన మేకర్స్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ వృషకర్మ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ప్రకటించారని చిత్ర యూనిట్ వెల్లడించింది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి నవంబర్ ఏడవ తేదీన ఫస్ట్ సింగిల్ స్వాగ్ ఆఫ్ అర్జున్ విడుదల కానుందని తెలిపారు. ఈ మేరకు విడుదలైన పోస్టర్ లో నాగచైతన్య రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.