స్థానిక ఎన్నికల ఖర్చులపై నిబంధనలు: అభ్యర్థులకు ఎన్నికల సంఘం స్పష్టత
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: గజపతినగరం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపై ఎన్నికల సంఘం స్పష్టమైన పరిమితులు విధించింది. బొండపల్లి మండల ఎన్నికల సహాయ అధికారి అరసాడ రఘుపతిరావు ఈ వివరాలను వెల్లడించారు. నామపత్రాల సమర్పణ సమయంలో చెల్లించాల్సిన ధరావతుతో పాటు ప్రచార ఖర్చుల వివరాలను ఆయన స్పష్టం చేశారు. నిర్ణీత పరిమితికి మించి ఖర్చు చేస్తే అనర్హత వేటు తప్పదని ఆయన హెచ్చరించారు.