నీట్ యూజీ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు: కేఈఏ కీలక ప్రకటన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కర్ణాటక
కర్ణాటక నీట్ యూజీ 2026 మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ గడువును కేఈఏ పొడిగించింది. విద్యార్థులు సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 2 గంటల వరకు ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఫీజు చెల్లింపునకు సాయంత్రం 4 గంటల వరకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 5 సాయంత్రం 6 గంటలలోపు కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. గడువులోగా స్పందించని అభ్యర్థులు తదుపరి కౌన్సెలింగ్కు అనర్హులని అధికారులు స్పష్టం చేశారు.