గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా పట్టభద్రులందరూ నమోదు కావాలని వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపు

రిపోర్టర్: రాజేష్ స్థలం: మహబూబ్ నగర్

హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులందరూ విధిగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన తన కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షితలతో కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. అర్హులైన యువత, పట్టభద్రులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా స్వయంగా ముందుకు వచ్చి ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.