హుస్సేన్సాగర్లో చిన్నారిని కాపాడిన ముగ్గురు పౌరులకు ఘన సన్మానం: సీపీ సజ్జనర్

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో మునిగిపోతున్న ఆరేళ్ల చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన ముగ్గురు పౌరులను నగర పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనర్ బషీర్బాగ్లోని కమిషనరేట్లో బుధవారం ఘనంగా సన్మానించారు. ఆపదలో ఉన్న చిన్నారికి ఆపన్నహస్తం అందించిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ప్రైవేటు ఉద్యోగి బాలకృష్ణ, వ్యాపారి అఫ్సర్లను ఆయన శాలువాలు కప్పి అభినందించారు. అనారోగ్య భారంతో తల్లి సాగర్లోకి తోసేయగా, ఈ సాహసికులు చాకచక్యంగా పాపను రక్షించారని కమిషనర్ పేర్కొన్నారు.