ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు అంటూ అవధేష్ ప్రసాద్ వ్యాఖ్య
రిపోర్టర్: భాస్కర్
స్థలం: లక్నో
ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు ఇప్పటికే గట్టిగా నిర్ణయించుకున్నారని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ స్పష్టం చేశారు. లక్నోలో మీడియాతో మాట్లాడుతూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూటమి ప్రకటనపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ ప్రజల నమ్మకం ఎస్పీ వైపే ఉందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మార్పు ఖాయమని ఎంపీ అవధేష్ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.