భాగ్యనగరంలో తాగునీటి సంక్షోభం: ప్రత్యేక గ్రీన్ ట్యాంకర్లతో శుద్ధి చేసిన నీటి సరఫరా

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

భాగ్యనగరంలో తలెత్తుతున్న తీవ్ర తాగునీటి ఎద్దడిని నివారించేందుకు జలమండలి ప్రత్యేక గ్రీన్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన మురుగునీటిని సరఫరా చేస్తోందని అధికారులు తెలిపారు. ఎల్నివో ప్రభావంతో వర్షపాతం తగ్గడంతో నగరంలో నీటి కష్టాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. భవనాల క్యూరింగ్, తోటపని, నిర్మాణ రంగ అవసరాల కోసం తొలి విడతగా ఇరవై ఒక్క ట్యాంకర్లను అందుబాటులోకి తెచ్చామని, వినియోగదారులు పదిహేను ఐదు మూడు ఒకటి మూడు నంబర్ కు కాల్ చేసి ఈ నీటిని బుక్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.