ఇసుక కొరతతో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులను ఇసుక సమస్య తీవ్రంగా వేధిస్తుంది. మొదటి దశలో మండలానికి 757 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే ఏకోజోన్ ఆంక్షల కారణంగా దాదాపు రెండు వందల ఇళ్ల నిర్మాణం వివిధ దశలలో నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ఏకోజోన్ పరిధిని తగ్గిస్తూ ప్రభుత్వం తక్షణమే జీవో జారీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.