ప్రయాగ్రాజ్ నిరసన విద్యార్థులపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సానుకూల స్పందన

రిపోర్టర్: సునీల్ స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్రాజ్ లో నిరసన తెలుపుతున్న టీజీటీ, పీజీటీ అభ్యర్థులు పోటీ పరీక్షలకు హాజరయ్యేలా వెసులుబాటు కల్పించాలని ఎన్ సీటీఈకి లేఖ రాయాలని సెకండరీ ఎడ్యుకేషన్ మంత్రి గులాబ్ దేవిని కోరినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఎడ్యుకేషన్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్తంభించిపోయిన వ్యవస్థ యువతలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.