మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్లకు డబ్బు పంపిణీ: నంద్యాలలో ఐదుగురు వైకాపా నేతల అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నంద్యాల

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించిన ఐదుగురు వైఎస్సార్సీపీ నేతలను నంద్యాల జిల్లా డోన్లో పోలీసులు అరెస్ట్ చేశారని అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి లక్ష రూపాయల నగదుతో పాటు ఓటరు స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోనూ వైకాపా నేత నివాసంలో సోదాలు నిర్వహించి ఎభై రెండు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.