మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు: దిల్లీకి ఎయిర్ ఇండియా విమానం వెనక్కి మళ్లింపు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: దిల్లీ
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం కారణంగా దిల్లీ నుంచి రియాద్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగానే వెనక్కి మళ్లిందని ఎయిర్ ఇండియా యాజమాన్యం వెల్లడించింది. సౌదీ అరేబియా రాజధానిపై యెమెన్‌కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడులకు పాల్పడటంతో భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల పదవ తేదీ వరకు రియాద్ విమాన సర్వీసెస్ అన్నీ రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్స్ స్పష్టం చేశాయి.