బీఆర్‌ఎస్ ఆక్రమణలపై రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ మంత్రి సవాల్

రిపోర్టర్: అశోక్ స్థలం: ధర్మారం

తెలంగాణలో సంపన్నుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ధర్మారంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల భూ ఆక్రమణలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పదేళ్ల పాలనలో దళితులను అంటరానివారిగా చూశారని మండిపడ్డారు. ఎర్రవల్లి ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించకపోవడం వారి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పట్టించుకోలేదని విమర్శించారు.