గోవా గవర్నర్ తో ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ భేటీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాకుళం
గోవాలో లోక్ భవన్లో గోవా గవర్నర్, విజయనగరం రాజవంశ సంస్థానదీశులు పూసపాటి అశోక్ గజపతిరాజును ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఆయన సతీమణితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు అల్పాహారం చేస్తూ ఎన్నో విషయాలపై ఆత్మీయంగా సంభాషించారు. తనకు లభించిన ఆతిథ్యం, అభిమానపూర్వక పలకరింపు ఎంతో సంతోషాన్నిచ్చిందని, వారి ఆశీస్సులు అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు.