ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోకపోతే నాశనం చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

రిపోర్టర్: నరేష్ స్థలం: అమెరికా

పశ్చిమాసియాలో యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితి వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైతే ఆ దేశాన్ని నాశనం చేయాలా లేదా అనే నిర్ణయం తీసుకునే దశలో ఉన్నానని హెచ్చరించారు. ఇరాన్‌పై ఆర్థికంగా ఒత్తిడి పెంచాలని ఇతర దేశాలకు విజ్ఞప్తి చేసిన ఆయన ఉగ్రవాదానికి టెహ్రాన్ ప్రధాన స్పాన్సర్ అని ఆరోపించారు.