సమస్యల పరిష్కారం కోసం నిరసన బాటలో వీఆర్ఏలు
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: పొదలకూరు
పొదలకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. గత ఎనిమిది సంవత్సరాలుగా అత్యల్ప వేతనంతో దుర్భర జీవితం గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వేతనం కుటుంబ పోషణకు సరిపోవడం లేదని వాపోయారు. పే స్కేల్ సవరణ, ప్రమోషన్లు కల్పించాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్ సురేఖకు సమ్మె నోటీసు అందజేశారు.