నూతన ఎక్సైజ్ అధికారులను సన్మానించిన గీత కార్మికులు

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

రామన్నపేట మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు, ఎస్సై అరుణ్ కుమార్ను గీత పనివారల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని, కల్తీ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని వారు అధికారులను కోరారు. దీనిపై స్పందించిన సీఐ కల్తీ కల్లును సహించేది లేదని హామీ ఇచ్చారు.