భారత్ కెనడా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు వేగవంతం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

భారత్‌-కెనడా మధ్య మందగించిన ద్వైపాక్షిక సంబంధాలు పుంజుకుంటున్న తరుణంలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు వేగవంతమయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి సీఈపీఏ ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సమావేశాల సందర్భంగా కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ మాట్లాడుతూ డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కెనడాలో పర్యటించే అవకాశం ఉందని, వాణిజ్య ఒప్పందం కొలిక్కి వస్తుందని వెల్లడించారు. అక్టోబర్‌ 5 నుంచి ఐదో విడత చర్చలు ప్రారంభంకానున్నాయి.