వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న విశ్వక్ సేన్

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస పరాజయాల తర్వాత బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన సొంత దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్ట్ సినిమాను అక్టోబర్ 30న విడుదల చేయనుండగా, నవంబర్ 19న ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ మరియు డిసెంబర్ 4న లెగసీ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వరుస చిత్రాలతో ఆయన మళ్లీ ఫామ్‌లోకి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.