నన్ను ఎన్కౌంటర్ చేయనివ్వండి, దేశం మేల్కొంటుందన్న సోనమ్ వాంగుక్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

లద్దాక్ కాల్పుల ఘటనకు ఏడాది పూర్తయిన వేళ యాక్టివిస్ట్ సోనమ్ వాంగుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లద్దాక్ అల్లర్లు, పౌరుల మరణాలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తనను అణచివేసేందుకు కేంద్రం గతంలో జైలుకు పంపిందని, ఇప్పుడు ఎన్కౌంటర్ మాత్రమే మిగిలిందని పేర్కొన్నారు. దేశం మేల్కొనేందుకు తన ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.