నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో పెట్టుబడులకు మంత్రి లోకేష్ ఆహ్వానం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అహ్మదాబాద్
అహ్మదాబాద్లో జరిగిన సీఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. క్లస్టర్ మోడల్ ద్వారా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోందని ఆయన తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రెండు వేల ఎకరాల్లో అభివృద్ధి చేసిన బల్క్ డ్రగ్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను మంత్రి కోరారు. భారతదేశంలో మూడో అతిపెద్ద ఔషధ ఎగుమతిదారుగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.