ఖమ్మం కలెక్టరేట్ వద్ద ప్రజా సమస్యలపై విపక్షాల భారీ ధర్నా

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ మరియు బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు మంజూరు చేయాలని, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించి అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.