హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ: అమెరికా ముందు ఇరాన్ ఏడు షరతులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: టెహ్రాన్

హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ కోసం అమెరికా ముందు ఇరాన్ ఏడు షరతులు పెట్టిందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి వెల్లడించారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయని, వాషింగ్టన్ అంగీకరిస్తే రెండు రోజుల్ లో జలసంధిని తెరుస్తామని స్పష్టం చేశారు. అమెరికా ఆంక్షల ఎత్తివేత, సైనిక బలగాల తగ్గింపుతో పాటు ఫ్రీజ్ చేసిన నిధుల విడుదల వంటి కీలక డిమాండ్లను టెహ్రాన్ తెరపైకి తెచ్చిందని ఆయన స్పష్టం చేశారు.