ట్రావిస్ కెల్స్ పెట్టుబడులు పెట్టిన సిక్స్ ఫ్లాగ్స్ పార్కులో ప్రమాదకర రైడ్ మూసివేత

రిపోర్టర్: కృష్ణ స్థలం: Los Angeles

అమెరికాలోని ప్రముఖ సిక్స్ ఫ్లాగ్స్ అమ్యూజ్మెంట్ పార్కులో తీవ్ర భద్రతా ఆందోళనల నేపథ్యంలో ఎక్స్ టూ రైడ్ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు పార్క్ అధికారులు వెల్లడించారు. ఈ పార్కులో ప్రముఖ ఎన్ఎఫ్ఎల్ స్టార్ ట్రావిస్ కెల్స్ భారీ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రైడ్ కారణంగా ఇటీవల ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలపాలై బ్రెయిన్ సర్జరీ చేయించుకోవడంతో పాటు, గతేడాది ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలపై బాధితుల కుటుంబాలు కోర్టును ఆశ్రయించడంతో యాజమాన్యంపై చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి.