మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: సింగోటం, కొల్లాపూర్
కొల్లాపూర్ నియోజకవర్గం సింగోటంలోని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పితృవియోగంతో దుఃఖంలో ఉన్న హర్షవర్ధన్ రెడ్డిని ఓదార్చి, వారి తండ్రి దివంగత బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.