మామ హత్య సమయంలో పబ్‌లో భర్తతో కలిసి డాన్స్ చేసిన కోడలు

రిపోర్టర్: శివ స్థలం: Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మామ వినీత్ మినోచా హత్యకు కుట్ర పన్నిన కోడలు షాలు మినోచా ఉదంతం వెలుగులోకి వచ్చింది. మామ హత్య జరుగుతున్న సమయంలోనే ఆమె పబ్‌లో భర్తతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. పార్టీలో ఉంటూనే హంతకులతో వాట్సాప్ కాల్స్ ద్వారా మాట్లాడుతూ ఆమె హత్యను ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితురాలితో పాటు ఇద్దరు హంతకులను పోలీసులు అరెస్టు చేశారు.