శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ ఆదేశం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ఆదేశించింది. తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని, బోర్డు అనుమతి లేకుండా ఏకపక్షంగా నీటిని తోడేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేయడంపై ఏపీ చేసిన ఫిర్యాదుతో బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.