బీసీసీఐ ఆటగాళ్ల గాయాల నిర్వహణపై రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: బెంగళూరు

భారత క్రికెటర్ల గాయాల నిర్వహణపై బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నెలకొన్న పరిస్థితులపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్ల గాయాల విషయంలో ఎవరి బాధ్యత ఏమిటనే దానిపై స్పష్టత లేదని, జవాబుదారీతనం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. జాతీయ జట్టు ఎంపిక విధానంలోనూ మార్పులు తేవాలని సూచిస్తూ, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉదంతాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.