ఎన్నికల కమిషనర్ల చట్టంపై సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయాల తీర్పు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: న్యూఢిల్లీ
కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ నుంచి ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తూ తెచ్చిన ఎన్నికల కమిషనర్ల చట్టం 2023 రాజ్యాంగబద్ధతను సవాలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇద్దరు సభ్యుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పు వెలువరించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్సీ శర్మలతో కూడిన ధర్మాసనంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ కేసును విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసే అంశంపై భిన్నమైన తీర్పులు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై తదుపరి నిర్ణయం కోసం భారత ప్రధాన న్యాయమూర్తి పరిశీలనకు పంపనున్నారు.