టీ20ల్లో సరికొత్త రికార్డ్ సృష్టించిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన ఫుల్ మెంబర్ దేశాల బౌలర్‌గా బుమ్రా రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను మెయిడెన్‌గా ముగించి జింబాబ్వే ఆటగాడు రిచర్డ్ నగరవ రికార్డ్‌ను అధిగమించాడు. ఇదే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై భారత్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.