యూపీఎస్సీ సివిల్స్ సాధించిన లూథియానా అన్నదమ్ములు
రిపోర్టర్: శివ
స్థలం: India
దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్స్ పరీక్షను పంజాబ్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు విజయవంతంగా సాధించారు. లూథియానాకు చెందిన అజయ్ పాల్ శర్మ ఐపీఎస్ అధికారిగా ఎంపిక కాగా, ఆయన తమ్ముడు అమిత్ పాల్ శర్మ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఉన్నత ఉద్యోగాలు సాధించి దేశవ్యాప్తంగా ఎందరికో ఈ సోదరులు ఆదర్శంగా నిలిచారు.