రాయలసీమ అభివృద్ధికి సరికొత్త బాట: లక్ష కోట్లతో మెగా హార్టికల్చర్ హబ్

రిపోర్టర్: సునీల్ స్థలం: ప్రకాశం

రాయలసీమ విజయ్ అభ్యుదయానికి ప్రభుత్వం రూ.1 లక్ష కోట్ల సమగ్ర ప్రణాళికతో మునుపెన్నడూ లేని విధంగా అడుగులు వేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. పది జిల్లాల్లో రెండు వందల ఒక ప్యాకేజీ కేంద్రాల ఏర్పాటు ద్వారా సుమారు 14.41 లక్షల హెక్టార్లలో ఉద్యాన విస్తీర్ణ లక్ష్యంతో పాటు 9.6 లక్షల మంది రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ఈ భారీ ప్రణాళిక దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.