ఎమ్మెల్సీ ఎన్నికల్ లో బీఆర్ఎస్ సత్తా చాటాలి: మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: మధిర
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా శ్రేణులన్నీ సమష్టిగా పనిచేయాలని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మధిరలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడేలా ఈ ఎన్నికల తీర్పు ఉండాలని ఆకాంక్షించారు. అర్హులైన పట్టభద్రులందరినీ ఓటరు జాబితాలో అధిక సంఖ్యలో చేర్పించాలని ఆయన శ్రేణులకు స్పష్టం చేశారు.