రూ.32 కేజీ ఉల్లి.. ఏపీలో రాయితీ ధరల పంపిణీ!
రిపోర్టర్: వెంకట్
స్థలం: దిల్లీ
ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను రూ.32 కే రాయితీ ధరకు అందించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కేంద్రం సహకారంతో కందిపప్పు, పామాయిల్‌ను కూడా తక్కువ ధరలకే అందిస్తామని, అక్టోబర్ 1 నుంచి వెయ్యి మీ-మార్టులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.