ఏపీ వైద్య రంగానికి రూ.64,100 కోట్లు కేటాయించిన కేంద్రం
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయవాడ
ఆంధ్రప్రదేశ్ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.64,100 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. విజయవాడలో సీఎం చంద్రబాబుతో కలిసి క్రిటికల్ కేర్ బ్లాక్‌లను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్యం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవలను మరింత విస్తరిస్తామని, నివారణ వైద్యానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.