పాలకొండలో కూటమి ఘన విజయంతో కదంతొక్కిన శ్రేణులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పాలకొండ
పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ హర్షం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పలికారన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి పట్టం కట్టారని, సీఎం చంద్రబాబుకు ఈ విజయాన్ని కానుకగా ఇస్తున్నామని గ్రీష్మ స్పష్టం చేశారు.